ముఖ్యమంత్రి మాటలన్నీ డొల్లమాటలే

ఇరవై లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న మంత్రి తుమ్మల ప్రకటనతో సీఎం రేవంత్‌రెడ్డి బండారం మరోసారి బైటపడిందని కేటీఆర్‌ ఆగ్రహం

Advertisement
Update:2024-10-04 12:39 IST

ఇరవై లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బండారం మరోసారి బైటపడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. వందశాతం రుణమాఫీ పూర్తి చేశామన్న ముఖ్యమంత్రి మాటలన్నీ డొల్లమాటలేనని మరోసారి తేలిపోయిందన్నారు. ఒకవైపు డిసెంబర్‌ 9న ఏకకాలంలో చేస్తామని దగాచేసి.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి అందించకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న మాటలు నయవంచన కాక మరేమిటి అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల మందికి రైతులకు అన్యాయం జరిగితే.. అనధికారికంగా ఎంతమంది రైతులున్నారో అని ఆందోళన వ్యక్తం చేశారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదని.. ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్‌ ముగిసినా ఇవ్వలేదంటూ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు.  

Tags:    
Advertisement

Similar News