తెలంగాణకు అలర్ట్‌.. ఈ మూడు రోజులూ ఎండలు మండిపోతాయి

ఈ రోజు నుంచి మరో మూడురోజుల పాటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ‌ అధికారులు చెప్తున్నారు. అది మరింత పెరిగి మే నెలలో 50 డిగ్రీలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Update:2023-04-18 08:28 IST

తెలంగాణలో ఈ మూడు రోజుల్లు ఎండలు మండిపోనున్నాయి. గత రెండు రోజులుగా మండిపోయే ఎండల అతలాకుతలం అవుతున్న ప్రజలు సాయంత్రాలు పడుతున్న వానల వల్ల కొంత ఉపశమనం పొందుతున్నారు.

అయితే ఈ రోజు నుంచి మరో మూడురోజుల పాటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ‌ అధికారులు చెప్తున్నారు. అది మరింత పెరిగి మే నెలలో 50 డిగ్రీలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సోమవారం నాడు సాయంత్రం పలు చోట్ల వానలు కురిసినప్పటికి పగలంతా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 7 జిల్లాల్లో పలుచోట్ల 44 డిగ్రీలకు పైగా, 18 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో 44.8 డిగ్రీలు, నల్లగొండ జిల్లా కట్టంగూర్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జంబుగలో 44.7, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.4, జగిత్యాల జిల్లా గోదూరులో 44.3, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నమోదవుతున్న ఉష్ణోగ్రతకన్నా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఆకాశంలో ఓజోన్ పొర కరిగిపోవడం మూలంగా సూర్యుడినుంచి వచ్చే యూవీ కిరణాలు డైరెక్ట్ గా భూమి మీదికి చేరుతుండటంతో ఎండ వేడిమి ఎక్కువగా ఉంటున్నదని, దీనివల్ల రేడియేషన్ కూడా పెరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News