'అలయ్‌-బలయ్‌' ఆత్మీయ సమ్మేళనం

అన్నిపార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే కార్యక్రమం అన్న హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

Advertisement
Update:2024-10-07 19:17 IST

అలయ్‌-బలయ్‌ ఒక సాంస్కృతిక కార్యక్రమమని.. అన్నిపార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. దసరా సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే 'అలయ్‌-బలయ్‌' కార్యక్రమానికి సంబంధించి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'అలయ్‌-బలయ్‌' రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఈ కార్యక్రమం 19వ వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉన్నదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్నిపార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా అలయ్‌-బలయ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 'అలయ్‌-బలయ్‌' అనేది ఆత్మీయ సమ్మేళనం. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేదే ఈ కార్యక్రమం అని దత్తాత్రేయ వివరించారు. అలయ్‌-బలయ్‌ కార్యక్రమ ఛైర్మన్‌ బండారు విజయలక్ష్మి మాట్లడుతూ.. ఇది ఆత్మీయ సమ్మేళనం అన్నారు. మనందరి కలయిక కోసం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని సృష్టించారని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News