మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మం

తెలంగాణలో మళ్ళీ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ రోజు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Update:2022-11-17 17:03 IST

తెలంగాణ ప్రభుత్వం 2018 లో ప్రార౦భించిన కంటివెలుగు కార్య‌క్ర‌మం విజయవంతం అయ్యింది. అనేక మంది తమ కంటి సమస్యలను నయం చేసుకోగలిగారు. 106 కోట్లు ఖర్చు చేసిన ఈ కార్యక్రమ౦ ద్వారా కంటి సమస్యలున్న వారికి కళ్ళద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చారు. 2018, ఆగస్టు 15 నుంచి ఐదు నెలలపాటు సాగిన ఈ కార్యక్రమం వల్ల వేలాది మంది లబ్దిపొందారు.

ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గతంలో జరిగిన కార్యక్రమం పై, మళ్ళీ ప్రారంభించనున్న కార్యక్రమం గురించి సీఎం కేసీఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో జనవరి 18వ తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News