నాలుగవ రౌండ్ తర్వాత పెరిగిన టీఆరెస్ ఆదిక్యం
మునుగోడు ఓట్ల లెక్కింపులో నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ ఆధిక్యంలో ఉంది.
Advertisement
మునుగోడు ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఫలితాల్లో టీఆరెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. మొదటి రౌండ్ లో టీఆరెస్ పూర్తి ఆధిక్యతను సాధించగా రెండవ, మూడవ రౌండ్స్ లో బీజేపీ కొద్దిగా ఆధిక్యత సాధించింది. మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి మొదటి రౌండ్ లో టీఆరెస్ కు వచ్చిన దాదాపు 1400 వందల ఆధిక్యం కాస్త తగ్గి 35 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ బీజేపీకన్నా 714 ఆధిక్యతలో ఉన్నది.
Advertisement