కాంగ్రెస్‌కు అదానీ,అంబానీల డబ్బు.. మోడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

రిజర్వేషన్ల అంశంపైనా స్పందించారు మోడీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగించి.. కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకుకు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు.

Advertisement
Update:2024-05-08 14:41 IST

కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రధాని మోడీ. అదానీ, అంబానీని కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లూ విమర్శించారని, కానీ ఎన్నికలు రాగానే ఆ ఇద్దరిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఆగిపోయాయన్నారు. అంబానీ, అదానీల నుంచి కాంగ్రెస్‌ ఎంత తీసుకుందని ప్రశ్నించారు మోడీ. ఈ గుట్టల కొద్ది డబ్బు గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ, అంబానీలను ఉద్దేశించి మోడీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

ఇక బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లకు ఫ్యామిలీ ఫస్ట్ అన్నారు మోడీ. రేవంత్‌ రెడ్డిపై గతంలో ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్.. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిందన్నారు. అలాగే కాళేశ్వరంపై విమర్శలు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్‌పై చర్యలు తీసుకోవట్లేదన్నారు. అవినీతి విషయంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ సిండికేట్ అయ్యాయన్నారు మోడీ.

ఇక రిజర్వేషన్ల అంశంపైనా స్పందించారు మోడీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగించి.. కాంగ్రెస్‌ తన ఓటు బ్యాంకుకు ఇవ్వాలనుకుంటోందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు మోడీ. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాంగ్రెస్‌ చిన్న చూపు చూస్తోందన్నారు. కాంగ్రెస్‌ రాజకీయాలతో ఓబీసీలకు తీవ్రనష్టమన్నారు మోడీ.

Tags:    
Advertisement

Similar News