ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం:హైడ్రా

కూల్చివేతలపై హైడ్రా ప్రకటన

Advertisement
Update:2024-09-22 15:44 IST

ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలను కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది.ఇవాళ చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా వెల్లడించింది. దాదాపు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. కేవలం వ్యాపారం కోసం నిర్మించిన భవనాలు మాత్రమే కూల్చివేసినట్లు పేర్కొన్నది.

కూకట్‌పల్లి నల్ల చెరువు పరిధిలోని అనధికార షెడ్లను కూల్చివేసినట్లు తెలిపింది. నల్లచెరువులోని సర్వే నంబర్‌ 66, 67,68, 69 లోని మొత్తం 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలు కూల్చివేశాం. నాలుగు ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కిష్టారెడ్డి పేటలోని సర్వే నంబర్‌ 164లో 3 భవనాలు కూల్చేశాం. ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేశాం. వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్న ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చేశాం. ఒక ఎకరం ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. పటేల్‌గూడలో సర్వేనంబర్‌ 12/2, 12/3లోని 25 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొన్నది. పటేల్‌గూడలో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా పేర్కొన్నది.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ భవనాలను కూల్చివేసినట్లు పేర్కొన్నది.






Tags:    
Advertisement

Similar News