ఎమ్మెల్యే రాజా సింగ్ కు షాక్... పీడీ యాక్ట్ ను సమర్థించిన అడ్వైజరీ కమిటీ

తనపై నమోదైన పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ రాజాసింగ్ అడ్వైజరీ బోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన కమిటీని కోరారు. అయితే ఆయ‌న అభ్యర్థనను కమిటీ తిర‌స్క‌రించింది.

Advertisement
Update:2022-10-26 18:58 IST

విద్వేష‌ వ్యాఖ్యల కేసులో జైలులో ఉన్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు చుక్కెదురైంది. విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ తనపై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రాజా సింగ్ అడ్వైజరీ కమిటీలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ పిటిషన్ పై అడ్వైజరీ కమిటీ బుధవారం విచారణ చేపట్టింది. ఆయ‌న‌పై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్టును కమిటీ సమర్థించింది.

ఓ మతాన్ని కించపరిచేలా రాజా సింగ్ వీడియో విడుదల చేశారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అనంత‌రం ఆయ‌న్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజా సింగ్ ఇంకా జైల్లోనే ఉన్నారు. జైల్లో ఉంటూనే తనపై నమోదైన పీడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ ఆయన అడ్వైజరీ బోర్డులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఏ మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, అకారణంగా తనపై పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారని ఆయన కమిటీకి విన్నవించారు. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన కమిటీని కోరారు. అయితే ఆయ‌న అభ్యర్థనను కమిటీ తిర‌స్క‌రించింది.

Tags:    
Advertisement

Similar News