మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సీఎం నివాళి

Advertisement
Update:2025-01-03 13:22 IST

మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి సావిత్రిబాయి ఫూలే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచినసావిత్రి బాయి ఫూలే జయంతిని రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందానిస్తోందన్నారు. మహిళా ఉపాధ్యాయులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సావిత్రి బాయి ఫూలే ఆశయ సాధనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. ఆడ బిడ్డలకు అన్నిరంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అవసరమైన నైపుణ్యాల వృద్ధికి ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ బలరామ్‌ నాయక్‌, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి తో పాటు పలువురు నేతలు సావిత్రీ బాయి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

సావిత్రి బాయి ఫూలేకు కేటీఆర్‌, హరీశ్‌ నివాళి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా సావిత్రి బాయి ఫూలేకు నివాళులు అర్పించారు. ఆడబిడ్డల చదవు కోసం అక్షర సమరం చేసిన చదవుల తల్లి, సామాజిక అసమాతలపై తిరుగుబాటు చేసిన పోరాట శీలి అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. మహిళ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్లే. స్త్రీ విద్య, సాధికారత కోసం పోరాడిన చదవుల తల్లి సావిత్రి బాయి అని, ఆమె ఆదర్శాలు కొనసాగించడమే ఆమెకు నిజమైన గౌరవం అన్నారు.

Tags:    
Advertisement

Similar News