టీచర్ల కౌన్సెలింగ్కు బ్రేక్
పోస్టింగులు ఇస్తామని చెప్పి అర్ధాంతరంగా కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించడంపై అభ్యర్థుల అసంతృప్తి
తెలంగాణ డీఎస్సీ ఉపాధ్యాయుల పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. తదుపరి కౌన్సెలింగ్ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామకపత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు ఇవాళ పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలిపింది. నూతన టీచర్లు ఆయా డీఈవోలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నది. వారు తమకు కేటాయించిన పాఠశాలలలో ఈ నెల 16వ తేదీన చేరాల్సి ఉంటుందని, వారి చేరిన స్థానంలో మూడు నెలల కిందట బదిలీఅయి రిలీవ్ కాని వారు ఉంటే గత జులైలో కేటాయించిన పాఠశాలకు వెళ్తారని, అలాంటి వారు దాదాపు 7 వేల మంది ఉన్నారు. పోస్గింగ్ల కేటాయింపు మంగళవారం దాదాపు పూర్తవుతుందని, ఏవైనా మిగిలితే బుధవారం కూడా జరుగుతుందని విద్యా శాఖ వర్గాలు చెప్పాయి.సాంకేతిక కారణాలో కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ నెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నియామక పత్రాలు అందించి , పోస్టింగులు ఇస్తామని చెప్పి అర్ధాంతరంగా కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.