చలికి వణుకుతున్న హైదరాబాద్...సికిందరాబాద్ లో 9.9°C

పశ్చిమం నుంచి వస్తున్న శీతల గాలుల వలన రానున్న రెండు రోజుల పాటు నగరంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement
Update:2023-01-11 07:56 IST

తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రజలను వణికిస్తోంది. గత వారంరోజులుగా హైదరాబాద్ లో ఉష్ణీగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారంనాడు సికిందరాబాద్ లో ఉష్ణీగ్రతలు 9.9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. హైదరాబాద్ సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది.

పశ్చిమం నుంచి వస్తున్న శీతల గాలుల వలన రానున్న రెండు రోజుల పాటు నగరంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

ఇక తెలంగాణలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 4.6 డిగ్రీల సెల్సియస్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 4.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

సిర్పూర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 4.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 31 జిల్లాల్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌లో నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సికింద్రాబాద్, అల్వాల్, ఆర్‌సి పురం, ఎల్‌బి నగర్‌లలో కూడా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది.

ప్రజలు రాత్రి వేళల్లో బైటికి రావద్దని, అనారోగ్యంగా ఉన్నవారు, వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరమైతే తప్ప బైటికి రావద్దని నిపుణులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News