ఏపీ, తెలంగాణలో మొదలైన న్యూ ఇయర్ వేడుకలు
డీజేలు, డ్యాన్సులతో హోరెత్తిస్తున్నయువత
Advertisement
విద్యుత్ దీపాల వెలుగులు, లేజర్ షోలు.. టపాసుల మోతలు.. యువత ఆనందోత్సాహాల మధ్య ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. బాణసంచా వెలుగుల్లో నగరాలు శోభాయమానంగా వెలుగులీనుతున్నాయి. కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలకడానికి ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేలు, డ్యాన్సులతో యువత హోరెత్తిస్తున్నారు. పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ,వరంగల్, గుంటూరు, రాజమహేంద్రవరం తదితర నగరాలు, పట్టణాలలో ప్రజలు రోడ్ల పైకి వచ్చి సందడి చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బేకరీలు, మటన్ షాపులు, రెస్టారెంట్లు, వైన్ షాపుల వద్ద జనం బారులు తీరారు. మరోవైపు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
Advertisement