ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టకు నీళ్లిస్తాం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Advertisement
Update:2024-12-31 19:41 IST

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం జలసౌధలో నల్గొండ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మిర్యాలగూడ ఈఈ లక్ష్మణ్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సస్పెండ్‌ చేస్తున్నామని మంత్రి తెలిపారు. పదేళ్లలో ఇరిగేషన్‌ రంగంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా కొత్త ఆయకట్టును సృష్టించలేకపోయాన్నారు. పాలమూరుపై రూ.27 వేల కోట్లు, సీతారామపై రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. దేవాదుల, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. సీతారామకు 67 టీఎంసీలు, సమ్మక్క - సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీల నీటి కేటాయింపులు పొందేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్‌, లక్ష్మారెడ్డి, మందుల సామేలు, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా, అడిషనల్‌ సెక్రటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీ అనిల్‌ కుమార్‌, సీఈ అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News