సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్
సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
సంక్రాంతి పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. అందులో 557 సర్వీసులకు ముందుస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. గతేడాది సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించగా.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో 5,246 బస్సులను నడిపింది.
గత సంక్రాంతి అనుభవాల దృష్ట్యా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్‌బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను ఆర్టీసీ నియమించింది. జనవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. సంక్రాంతి బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమల్లో ఉంటుందని జీరో టికెట్ తీసుకోవాలని సూచించింది.