న్యూఇయర్‌ వేడుకలకు దూరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే?

న్యూ ఇయర్‌కు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement
Update:2024-12-31 19:14 IST

నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. డిసెంబర్ 26న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశాసిన సంగతి తెలిసిందే. మన్మోహన్ మృతికి కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఏడు రోజులు అన్ని పార్టీ కార్యక్రమాలు రద్దు చేసుకుంది.

ఈ నేపథ్యంలో మన్మోహన్‌ సింగ్‌ సంతాప దినాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలకు హాజరు కావద్దని నిర్ణయం తీసుకుంది. వేడుకలకు దూరంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉండనున్నారు. 

Tags:    
Advertisement

Similar News