8వ నిజాం రాజు ముకర్రం జా మృతి!
తన స్వదేశంలోనే తన అంత్యక్రియలు జరగాలనే అతని కోరిక మేరకు, అతని పిల్లలు 17 జనవరి 2023 మంగళవారం నాడు నిజాం భౌతికకాయంతో హైదరాబాద్‌కు రానున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు.
హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదవ నిజాం ముకర్రం జా బహదూర్ గురువారం రాత్రి ఇస్తాంబుల్‌లో కన్నుమూసినట్లు ఆయన కుటుంబం తరపున ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆయన వయస్సు 89. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ వారసుడు , మనవడు అయిన ముకర్రం జా టర్కీలో నివసిస్తున్నారు.
“హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ గత రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో రాత్రి 10.30 గంటలకు (IST) మరణించారని మీకు తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాము” అని ప్రకటన పేర్కొంది.
తన స్వదేశంలోనే తన అంత్యక్రియలు జరగాలనే అతని కోరిక మేరకు, అతని పిల్లలు 17 జనవరి 2023 మంగళవారం నాడు నిజాం భౌతికకాయంతో హైదరాబాద్‌కు రానున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు.
" మృతదేహాన్ని చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకువెళతారు. అవసరమైన కర్మలను పూర్తి చేసిన తర్వాత అసఫ్ జాహీ కుటుంబ సమాధులలో అంత్యక్రియలు జరుగుతాయి. షెడ్యూల్, ఇతర వివరాలు తగిన సమయంలో విడుదల చేస్తాము. ” అని ప్రకటన పేర్కొంది. అసఫ్ జాహీ సమాధులు చార్ మినార్ పక్కన మక్కా మసీదు ప్రవేశ ద్వారం వద్ద ఉన్నాయి.