కుక్కల బెడదపై క‌మిటీ, మరణించిన బాలుడి కుటుంబానికి 8 లక్షల నష్టపరిహారం... GHMC నిర్ణయం

హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల బెడద ఎక్కువ కావడం, వాటి కారణంగా పలు చోట్ల ప్రజలు గాయపడుతుండటం, ఒక్కో సారి పిల్లల ప్రాణాలు పోతుండటంతో జీహెచ్ఎంసీ కుక్కల బెడదపై కమిటీ వేయాలని నిర్ణయించింది.

Advertisement
Update:2023-02-28 18:30 IST

హైదరాబాద్ లోని అంబర్ పేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి 8 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని GHMC నిర్ణయించింది. హైదరాబాద్ లో వీధి కుక్కల బెడదపై విచారణకు కమిటీని నియమించాలని కూడా జీహెచ్ ఎంసీ నిర్ణయించింది.

హైదరాబాద్ పరిధిలో వీధి కుక్కల బెడద ఎక్కువ కావడం, వాటి కారణంగా పలు చోట్ల ప్రజలు గాయపడుతుండటం, ఒక్కో సారి పిల్లల ప్రాణాలు పోతుండటంతో జీహెచ్ఎంసీ కుక్కల బెడదపై కమిటీ వేయాలని నిర్ణయించింది.

అంతే కాకుండా కొద్దిరోజుల క్రితం కుక్కల దాడిలో చనిపోయిన నాలుగేండ్ల ప్రదీప్ కుటుంబానికి రూ. 8 లక్షల పరిహారం అందించాలని GHMC తీర్మానించింది. బాధిత కుటుంబానికి కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనం కూడా ఇవ్వనున్నారు.

రాష్ట్ర మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా కుక్కల బెడద నివారణకు మార్గదర్శకాలను జారీచేశారు. రాష్ట్రంలో కుక్కల బెడదను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

Tags:    
Advertisement

Similar News