హైదరాబాద్‌లో 700 కేజీల కుళ్లిన చికెన్ స్వాధీనం

హైదరాబాద్ బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య చికెన్ సెంటర్‌లో ఆహారభద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Advertisement
Update:2024-10-18 14:59 IST

హైదరాబాద్ బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన కోడి మాంసాన్నిఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య చికెన్ సెంటర్‌లో ఆహారభద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లిక్కర్ షాపులకు చికెన్ సఫ్లయ్ చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కోడి మాంసం, కొవ్వు పదార్థాలు, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మద్యం దుకాణాలకు అమ్ముతున్నట్లుగా నిర్ధరించారు. అనంతరం అధికారులు చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు. యాజమానులకు నోటీసులిచ్చారు. చికెన్ తినేవారు ఇకనైనా కాస్త జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయడం మంచిది.

హైదరాబాద్‌లో ప్రతి వస్తువులో కల్తీ ఉంటుంది. మరోవైపు నిన్న కొండాపూర్ లోని శరత్ సిటీ మాల్ లో ఆహారభద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాల్ లో ఉన్న చట్నీస్ లో తనిఖీలు చేయగా.. FSSAI లైసెన్స్ ను అందరికీ కనిపించేలా పెట్టలేదని గుర్తించారు. ఆహార తయారీకి వాడే పదార్థాలను బొద్దింకలు తిరిగే ప్లేస్ లో ఉంచారని, గోధుమపిండి, రవ్వ వంటి పదార్థాల్లో బ్లాక్ ఫంగస్ వచ్చిందని గుర్తించినట్లు ఎక్స్ వేదికగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News