26 మంది IASల బదిలీ.. స్మితా సబర్వాల్‌కు ఆ బాధ్యతలు..!
నల్గొండ కలెక్టర్‌గా హరిచందన దాసరికి బాధ్యతలు అప్పగించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్‌కు బాధ్యతలు కేటాయించింది.
తెలంగాణలో మరోసారి భారీగా IAS అధికారుల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఈసారి 26 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పించింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్‌ను తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా నియమించింది. ఇక కీలకమైన ఇరిగేషన్ శాఖ కార్యదర్శి బాధ్యతలు రాహుల్ బొజ్జాకు అప్పగించింది. సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీతా సత్యనారాయణను నియమించింది. నల్గొండ కలెక్టర్‌గా హరిచందన దాసరికి బాధ్యతలు అప్పగించింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్‌కు బాధ్యతలు కేటాయించింది.
స్మితా సబర్వాల్ - ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి
రాహుల్ బొజ్జా - ఇరిగేషన్ కార్యదర్శి
సంగీతా సత్యనారాయణ - సీఎంవో జాయింట్ సెక్రటరీ
భారతీ హోలికేరి - పురావస్తు శాఖ డైరెక్టర్
బుర్రా వెంకటేశ్ - బీసీ వెల్ఫేర్ సెక్రటరీ
హరిచందన దాసరి - నల్గొండ కలెక్టర్
ఎ.శరత్ - ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ
జి.చంద్రశేఖర్ రెడ్డి - సీఎంవో సెక్రటరీ
వల్లూరు క్రాంతి - సంగారెడ్డి కలెక్టర్
మహేష్ దత్ ఎక్కా - గనుల శాఖ ముఖ్య కార్యదర్శి
శశాంక - రంగారెడ్డి జిల్లా కలెక్టర్
దివ్య - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్
అద్వైత్ కుమార్ సింగ్ - మహబూబబాద్ కలెక్టర్
సంతోష్ - జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్
రఘునందన రావు - GAD పొలిటికల్ సెక్రటరీ
అహ్మద్ నజీద్ - ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి
వీరితో పాటు మరికొంత మంది ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.