2022 హైదరాబాద్ లో ఆకాశ హర్మ్యాల సంవత్సరం

ఇప్పటి వరకు కోకాపేట్‌లోని 57-అంతస్తుల SAS క్రౌన్ అత్యంత ఎత్తైన భవనం కాగా 55 అంతస్తుల పౌలోమి పలాజో రెండవ‌ అత్యంత ఎత్తైన బిల్డింగ్. ఆ తర్వాత‌ 50-అంతస్తుల కాండ్యూర్ క్రెసెంట్ , నానక్‌రామ్‌గూడలో 44-అంతస్తుల ది ఒలింపస్ లు ఉన్నాయి.

Advertisement
Update:2022-12-31 09:36 IST

హైదరాబాద్ అభివృద్ది కాలంతో పోటీ పడుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నడు లేనంత వేగవంతం, నాణ్యమైన అభివృద్ది సాగుతోంది. 2022 సంవత్సరంలో హైదరాబాద్ లో ఎన్నడు లేనన్ని అంతస్తులతో భవనాలకు అనుమతులు లభించాయి.

కోకాపేట్‌లోని పౌలోమి పలాజో 55 అంతస్తుల నిర్మాణానికి,శేరిలింగంపల్లిలోని కాండ్యూర్ క్రెసెంట్ 50 అంతస్తుల నిర్మాణానికి ఈ ఏడాది అనుమతి పొందాయి.

ఇప్పటి వరకు కోకాపేట్‌లోని 57-అంతస్తుల SAS క్రౌన్ అత్యంత ఎత్తైన భవనం కాగా 55 అంతస్తుల పౌలోమి పలాజో రెండవ‌ అత్యంత ఎత్తైన బిల్డింగ్. ఆ తర్వాత‌ 50-అంతస్తుల కాండ్యూర్ క్రెసెంట్ , నానక్‌రామ్‌గూడలో 44-అంతస్తుల ది ఒలింపస్ లు ఉన్నాయి.

భూముల కొరత లేనప్పటికీ హైదరాబాద్‌లో బిల్డర్లు ఎక్కువ అంతస్తులతో ఎత్తైన భవనాల నిర్మాణానికే ఆసక్తి చూపిస్తున్నారు.GHMC పరిధిలో లేని కోకాపేట్, నార్సింగితో సహా అనేక ప్రాంతాల్లోనే కాక‌ 2022లో, దాదాపు 82 ఎత్తైన భవనాలకు(హైరైజ్‌లకు) GHMC పరిధిలో కూడా అనుమతులు మంజూరు అయ్యాయి.

GHMC అనుమతి ఇచ్చిన 82భవనాల్లో 60 నివాస భవనాలు, 22 వాణిజ్య సంస్థలు. వీటితో పాటు 16 లేఅవుట్లు/గేటెడ్ కమ్యూనిటీలకు ఆమోదం లభించింది. ఆమోదం పొందిన 82 ప్రాజెక్ట్‌లలో 14 ఎత్తైన నివాస భవనాలు 30 అంతస్తుల కంటే ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ఎత్తైన భవనాలు 10-30 అంతస్తుల పరిధిలో ఉంటాయి.

ఏదేమైనా ఒకప్పుడు పక్కలకు విస్తరించే హైదరాబాద్ ప్రస్తుతం ఆకాశంపైకి వెళ్తోంది. ఎక్కడ చూసినా ఆకాశహార్మ్యాలే కనిపిస్తున్నాయి. ప్రజల్లో కూడా వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

Tags:    
Advertisement

Similar News