16 వేల మెగావాట్ల మైలురాయిని దాటిన విద్యుత్ డిమాండ్
డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేస్తామన్న డిప్యూటీ సీఎం
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైం రికార్డుకు చేరింది. 16 వేల మెగావాట్ల మైలురాయిని దాటింది. అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా విద్యుత్ సరఫరా పరిస్థితిపై సీఎండీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ డిమాండ్ సమస్యలు లేకుండా దీటుగా ఎదుర్కొంటామన్నారు. డిమాండ్ ఎంత పెరిగినా దానికి తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేస్తామని భట్టి తెలిపారు.
Advertisement