బీఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్రకు చెందిన 100 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు
గురువారం బోకర్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బోకర్ మండల ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కేసీఆర్ వినూత్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు.
ఫిబ్రవరి 5న నాందేడ్‌లో భారత రాష్ట్ర సమితి బహిరంగ ఏర్పాట్ల కోసం తెలంగాణ అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మహారాష్ట్రలో విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో మహారాష్ట్రకు చెందిన 100 మంది ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరారు.
గురువారం బోకర్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బోకర్ మండల ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో కేసీఆర్ వినూత్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణతో సమానంగా తమ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని, బీఆర్‌ఎస్‌లో సభ్యులు కావడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు.
అనంతరం బోకర్ మండలంలోని రాఠి, నందా, మథుడ్ తదితర గ్రామాల్లో మంత్రి పర్యటించి స్థానిక మహిళలు, వృద్ధులు, యువకులతో ముచ్చటించారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధ్యక్షుడు సర్దార్ రవీందర్ సింగ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ముధోలు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ లోలం శ్యాంసుందర్, బీఆర్‌ఎస్ నాయకుడు భామిని రాజన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.