అధికారంలోకి వచ్చి 10 నెలలు కాలేదు అప్పడే కుట్రల? : మంత్రి దామోదర

రాష్ట్రం గత 10 ఏళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రూ.50 వేల కోట్ల అప్పు తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మంత్రి దామోదర అన్నారు.

Advertisement
Update:2024-11-17 21:45 IST

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం 10 నెలలు కాకుండానే ప్రభుత్వంపై కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి బీఆర్ఎస్ కుట్రే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు మంచివి కాదని తెలిపారు. లగచర్ల ఘటన తర్వాత కొంతమంది ఢిల్లీకి పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు మధ్యలో మారరు అని విమర్శించారు. కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ అలాంటి బుద్ధులు రాలేదని అన్నారు.అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే రూ.50 వేల కోట్ల అప్పు తీర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దక్కుతుందని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News