గ్రూప్-4 అభ్యర్థులకు నేడు నియామకపత్రాల అందజేత
పెద్దపల్లిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..యువ వికాసం వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా యువ వికాసం వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరుకానున్నారు. గ్రూప్-4లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామకపత్రాలు అందించనున్నారు. స్కిల్ వర్సిటీలో భాగమయ్యే సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. డిజిటల్ ఎంప్లాయి మెంట్ ఎక్స్చేంజ్, సీఎం కప్‌ను రేవంత్ ప్రారంభించనున్నారు. బస్‌డిపో-పెద్దపల్లి-సుల్తాన్‌బాద్ బైపాస్ రోడ్ నిర్మానానికి శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా మంజూరైన పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నారు.
సీఎం పెద్దపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆ జిల్లాలకు వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లికి రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, 4 లైన్ల బైపాస్ రోడ్డు మంజూరు చేశారు. ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్‌ను, వ్యవసాయ మార్కెట్ మంజూరు చేశారు. పెద్దపల్లిలోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడెషన్ చేశారు. మంథనిలో 50 పడగల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసింది. గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటునకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటకు బహిరంగ సభ జరగనున్నది.