స్వదేశంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే అత్యంత ముఖ్యం
భారత్ పై గెలిచేందుకు కలసికట్టుగా శ్రమిస్తాం : పాకిస్థాన్ వైస్ కెప్టెన్ అఘా సల్మాన్
పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ -2025ను గెలవడమే తమ జట్టుకు అత్యంత ముఖ్యమని పాకిస్థాన్ వైస్ కెప్టెన్ అఘా సల్మాన్ అన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు, దయాదులు ఇండియా - పాకిస్థాన్ ఈనెల 23న ముఖాముఖి తలపడబోతున్న నేపథ్యంలో ఇండియాపై గెలవడం ముఖ్యమా.. చాంపియన్స్ ట్రోఫీ గెలవడం ప్రధానమా అనే ప్రశ్న అఘా సల్మాన్ కు ఎదురైంది. తమ దేశం నిర్వహిస్తున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఐసీసీ నిర్వహించడం తమకెంతో స్పెషల్ అన్నాడు. లాహోర్ గడ్డపై టైటిల్ అందుకోవాలన్నదే తమ టీమ్ టార్గెట్ అన్నారు. తమ కల నెరవేరుతుందని భావిస్తున్నానని చెప్పాడు. టైటిల్ గెలిచే సత్తా తమకుంది అన్నారు. ఇండియాతో తలపడటం అంటే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు. టైటిల్ పోరుకన్నా ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ కే ఫ్యాన్స్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. క్రికెటర్ గా తాను మాత్రం అన్ని ఇతర మ్యాచ్‌ల లాంటిదే ఇండియాతో పోరు అనుకుంటానని చెప్పారు. ఆ ఒక్క మ్యాచ్ లో గెలవడం కన్నా చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడమే తమకు ముఖ్యమన్నారు. తమ జట్టు సమష్టిగా ఇండియాపై గెలవాలని కోరుకుంటుందని చెప్పారు.