మార్చి 22న ఫస్ట్ మ్యాచ్.. మే 25న ఫైనల్
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
మెగా క్రికెట్ ఈవెంట్ ఐపీఎల్ షెడ్యూల్ ఆదివారం సాయంత్రం ప్రకటించారు. మార్చి 22న డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ - బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుండగా మే 25న జరిగే ఫైనల్ తో ఈ మెగా టోర్రీ ముగియనుంది. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులను సంబరాల్లో ముంచెత్తనుంది. 65 రోజుల్లో 75 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం పది జట్లు ఐపీఎల్ లో తలపడుతున్నాయి. మెగా టోర్నీ ప్రారంభమైన తెల్లారే.. అంటే మార్చి 23న హైదరాబాద్ - రాజస్థాన్ మ్యాచ్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. విశాఖపట్నంలోని క్రికెట్ అభిమానులను ఐపీఎల్ అలరించనుంది. మార్చి 24న ఢిల్లీ - లక్నో, మార్చి 30న ఢిల్లీ - హైదరాబాద్ మ్యాచ్‌లు విశాఖలో జరుగనున్నాయి. ఐపీఎల్ -2025లో ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ మే 20న ఎలిమినేటర్ మ్యాచ్ మే 21న, రెండో క్వాలిఫయర్ మ్యాచ్ మే 23న జరుగనున్నాయి.