నేటి నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ

కరాచీ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్‌లో తలపడనున్న పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌

Advertisement
Update:2025-02-19 12:59 IST

ఇప్పటిదాకా టెస్టులు, టీ20లను ఆస్వాదించిన అభిమానుల కోసం మరో మెగా టోర్నీతో సందడి చేయడానికి వచ్చేసింది. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానున్నది. కరాచీ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్‌ పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు 8 సార్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ జరిగింది. ఈ తొమ్మిదో టైటిల్‌ కోసం ఇప్పుడు టాప్‌-8 జట్లు బరిలోకి దిగాయి. గ్రూప్‌ఏలో ఉన్న రోహిత్‌ సేన బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో తలపడనున్నది. సెమీస్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమే. ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో దుబాయ్‌ వేదికగా ఈ నెల 20న ఆడనున్నది.

ఛాంపియన్‌ ట్రోఫీ సుమారు 8 ఏళ్ల తర్వాత అభిమానులు అలరించడానికి వచ్చింది. చివరిసారిగా 2017లో టోర్నీ జరిగింది. పాకిస్థాన్‌ విజేతగా ఆవిర్భవించింది. వన్డే ఫార్మాట్‌లో రెండు మేజర్‌ ఈవెంట్లు ఎందుకనే ఆలోచనతో 2021లో ఐసీసీ ఈ ఛాంపియన్‌ ట్రోఫీని నిలివేసింది. కానీ అభిమానుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మళ్లీ టోర్నీని పునః ప్రారంభించింది.ఈసారి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్నది. అయితే డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుండటం గమనార్హం. మహమ్మద్‌ రిజ్వాన్‌ నాయకత్వంలో పాక్‌ ఆడుతున్నది. చివరిగా 2017లో జరిగిన ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై 180 రన్స్‌ తేడాతో పాక్‌ గెలిచి టైటిల్‌ సొంతం చేసుకున్నది. ఇప్పుడు మళ్లీ ఒకే గ్రూపులో దాయాదులు ఉన్నారు. ఫిబ్రవరి 23న వీరి మధ్య మ్యాచ్‌ జరగనున్నది.

కోహ్లీ,రోహిత్‌కు ఇదే చివరి ట్రోఫీనా?

టీమిండియా సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫి అవుతుందని పలువురు భావిస్తున్నారు. గౌతమ్‌ గంభీర్‌ ప్రధాన కోచ్‌గా వచ్చిన కొత్తలోనే .. సీనియర్లు ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్‌ టీమ్‌లో ఉండకపోవచ్చనే సిగ్నల్స్‌ ఇచ్చాడు. ఇప్పటికే టీ 20 ప్రపంచకప్‌ గెలిచాక పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం విదితమే. ఇప్పుడు ఈ ట్రోఫీ గెలిచాక వన్డేలకూ గుడ్‌బై చెప్తాని క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

  • ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 19 వరకు జరగనున్నది.
  • పాకిస్థాన్, దుబాయ్‌లోని మూడు వేదికలు 15 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
  • ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయ్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి.
Tags:    
Advertisement

Similar News