ప్రేమానంద్‌ మహరాజ్‌ ఆశ్రమానికి విరుష్క దంపతులు

ఫొటోలు ఎక్స్‌ లో షేర్‌ చేసిన అనుష్క శర్మ

Advertisement
Update:2025-01-10 16:32 IST

స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ప్రముఖ హీరోయిన్‌ అనుష్క శర్మ దంపతులు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రేమానంద్‌ మహరాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించారు. అనుష్కశర్మ తన ఎక్స్‌ ఎకౌంట్‌లో ఈ ఫొటో, వీడియో షేర్‌ చేశారు. తమ కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌ తో కలిసి తమకెంతో ఇష్టమైన బృందావన్‌ ను సందర్శించామని ఆమె పేర్కొన్నారు. 2023లో, ఇప్పుడు ఆశ్రమాన్ని సందర్శించిన రెండు ఫొటోలను తన ట్వీట్‌ కు జత చేశారు. ఫామ్‌ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో విరాట్‌ కోహ్లీ కుటుంబంతో కలిసి బృందావన్‌ ను సందర్శించారు. గతంలోనూ కెరీర్‌ లో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కింగ్‌ కోహ్లీ ఈ ఆశ్రమాన్ని సందర్శించి నూతనోత్సాహంతో క్రికెట్‌ గ్రౌండ్‌ లోకి దిగాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు కోహ్లీ మళ్లీ ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. దీంతో ఆయన మళ్లీ టచ్‌ లోకి వస్తాడని.. బ్యాట్‌ తో మెరుపులు మెరిపిస్తాడని క్రికెట్‌ లవర్స్‌ అంచనాలు వేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News