ఆ ఇండియన్‌ పేసర్‌ ఆస్ట్రేలియన్లను గజగజలాడిస్తడు

మయాంక్‌ యాదవ్‌ కు పాక్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ కితాబు

Advertisement
Update:2024-09-23 19:48 IST

ఇండియన్‌ యంగ్‌ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ పై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ ప్రశంసలు కురిపించారు. టీమిండియా ఇప్పుడు స్టార్ పేసర్లతో కలకలలాడుతోందని తెలిపారు. రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో మయాంక్‌ కు చోటు కల్పించాలని సెలక్షన్‌ కమిటీకి సూచించారు. బంగ్లాదేశ్‌ తో జరిగిన ఫస్ట్‌ టెస్ట్‌ లో భారత పేస్‌ బౌలర్ల ప్రదర్శన చూడటానికి రెండు కళ్లు చాల లేదన్నారు. జస్ప్రీత్‌ బూమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ సింగ్ అద్భుతమైన బౌలింగ్‌ తో ఆకట్టుకున్నారని, సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ లేకుండానే టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచిందన్నారు. వాళ్ల బౌలింగ్‌ చూస్తుంటే ఒకప్పుడు పాకిస్థాన్‌ జట్టులోని షోయబ్‌ అక్తర్‌, వకార్‌ యూనిస్‌, వసీమ్‌ అక్రమ్‌ తనకు గుర్తుకువచ్చారన్నారు. మయాంక్‌ పేస్‌ కు బౌన్స్‌ కు జత కలిస్తే ఆసీస్‌ బ్యాట్స్‌ మన్‌ కు చుక్కలు కనిపించడం ఖాయమన్నారు. ఇప్పటి నుంచే ఇండియన్‌ సెలక్టర్లు యువ పేసర్‌ సిద్ధం చేయాలని సూచించారు. 2024 ఐపీఎల్‌ లో ఫాస్టెస్ట్‌ బాల్‌ ను బౌల్‌ చేసి మయాంక్‌ అందరి దృష్టిని ఆకర్శించాడు. ఐదు టెస్ట్‌ ల బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా రెండు నెలల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

Tags:    
Advertisement

Similar News