టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాప్రికా

రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

Advertisement
Update:2024-11-10 19:29 IST

భారత్, దక్షిణాప్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరిస్‌లో నేడు గెబేహాలో జరిగే రెండో మ్యాచ్‌లో సపారీలు టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకుంది .ఈ మ్యాచ్‌ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. క్రూగర్‌ స్థానంలో రీజా హెండ్రిక్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్‌ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. డర్బన్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 61 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

తుది జట్లు..

భారత్ : సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్

దక్షిణాఫ్రికా : ఎయిడెన్‌ మార్క్రమ్(కెప్టెన్‌), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్‌), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్

Advertisement

Similar News