భారత్ 185 ఆలౌట్
బోలాండ్, స్టార్క్ బౌలింగ్‌కు బెంబేలెత్తిన భారత బ్యాటర్లు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 రన్స్‌కు ఆలౌటైంది. పంత్ 40, జడేజా 26, గిల్ 20, బుమ్రా 22 రన్స్ చేశారు.64 ఓవర్లకే భారత్ 7 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (26)ను మిచెల్ స్టార్క్ ఎల్బీ చేశాడు. జడేజా డీఆర్‌ఎస్ తీసుకున్నా ఫలితం సానుకూలంగా రాలేదు. దీంతో జడేజా నిరాశగా పెవిలియన్‌ను చేరాడు. ఆసీస్ బౌలర్ బోలాండ్ వేసిన వరుస బంతుల్లో పంత్ (40) నితీశ్‌రెడ్డి (0) రన్స్‌కు ఔటయ్యారు. ఆఫ్‌సైడ్ బాల్‌ను కదిలించి నితీశ్ స్లిప్‌లో దొరికిపోయాడు. అంతకు ముందు పంత్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్‌లో కిమన్స్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. సుందర్ (14) కమిన్స్ బౌలింగ్‌లో 65.6 ఓవర్‌లో లెగ్‌సౌడ్ బాల్‌ను ఆడటానికి యత్నించాడు. బాల్ ఎడ్జ్ తీసుకున్నదని ఆసీస్ అప్పీల్ చేసింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. డీఆర్‌ఎస్ తీసుకున్న ఆసీస్‌కు సానుకూల ఫలితం వచ్చింది. సమీక్షలో ఔట్‌గా తేలడంతో సుందర్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. 148 రన్స్ వద్ద భారత్ 8వ వికెట్ కోల్పోయింది. ప్రసిధ్ కృష్ణ (3) కూడా స్టార్క్ బౌలింగ్‌లో (68.2 ఓవర్) భారీ షాట్‌కు యత్నించి కొన్‌స్టాస్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత స్కోరు 168. చివరి వికెట్‌గా జస్ ప్రీత్ బూమ్రా (22) పెవిలియన్ చేరాడు. టీమిండియా ఇన్సింగ్స్‌లో రిష్ పంత్ (40) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టారు. కమిన్స్ 2 వికెట్లు, నాథన్ లైయన్ ఒక వికెట్ తీశారు.