రిటైర్మెంట్‌పై రోహిత్‌ కీలక వ్యాఖ్యలు

రిటైర్మెంట్‌ తీసుకోవడం లేదని.. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసన్న రోహిత్‌

Advertisement
Update:2025-01-04 07:58 IST

వరుసగా విఫలమౌతున్న భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సిడ్నీ టెస్టులో విశ్రాంతి తీసుకుని అందరని ఆశ్చర్యానికి గురిచేశాడు. అంతకుముందు హెడ్‌ కోచ్‌తో గౌతమ్‌ గంభీర్‌ డ్రెసింగ్‌ రూమ్‌ లో ఆటగాళ్లతో మాట్లాడిన విషయాలు బైటికి రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో హెడ్‌ కోచ్‌, కెప్టెన్‌ రోహిత్ మధ్య విభేదాలతోనే అతను సిడ్నీ టెస్టుకు దూరంగా ఉన్నాడని, త్వరలోనే ఆయన రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే వార్తలు ప్రచారమయ్యాయి. ఈ వార్తకు రోహిత్‌ చెక్‌ పెట్టాడు. ఆసీస్‌తో ఐదో టెస్టు రెండో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయంలో ఇర్ఫాన్‌ పఠాన్‌తో కలిసి రోహిత్‌ మాట్లాడాడు. తన భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చాడు. జట్టు అవసరాల దృష్ట్యామాత్రమే తాను సిడ్నీ టెస్టులో విశ్రాంతి తీసుకున్నానని స్పష్టం చేశాడు.

నేను రిటైర్మెంట్‌ తీసుకోవడం లేదు. సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకున్నాను. జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. పెర్త్‌ టెస్టులో కేఎల్‌ రాహుల్-యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జోడిని మార్చకూడదనే ఉద్దేశంతో పాటు.. ఫామ్‌లోనూ కేఎల్‌ రాహుల్‌ మెరుగ్గా ఉన్నాడు. ఇక మీడియాలో వస్తున్నట్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎలాంటి సమస్యలు లేవు. సోషల్‌ మీడియాను నియంత్రించలేం. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. ఆ తర్వాతే తానంటూ చెప్పాడు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. 

Tags:    
Advertisement

Similar News