సీఎం రేవంత్‌ రెడ్డితో బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ భేటీ

స్పోర్ట్స్‌ వర్సిటీకి తనవంతు సహకారం అందిస్తానని హామీ

Advertisement
Update:2025-01-08 18:16 IST

సీఎం రేవంత్‌ రెడ్డితో బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఇంటెగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డిని గోపీచంద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్‌ అకాడమీలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News