లంచ్ బ్రేక్.. ఆస్ట్రేలియా స్కోరు 101/5
భారత బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ లకు ఒక వికెట్
బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌లో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 101/5 రన్స్ చేసింది. ఇంకా 84 రన్స్ వెనకబడి ఉన్నది. వెబ్‌స్టర్ (28*), అలెక్స్ కెరీ (4*) క్రీజులో ఉన్నారు. సామ్ కొన్‌స్టాస్ 23, ఖవాజా 2, హెడ్ 4, స్మిత్ 33 రన్స్‌కు వెనుదిరిగారు. భారత బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 185 రన్స్ చేసిన విషయం విదితమే.
15 రన్స్ వద్ద బుమ్రా లబుషేన్‌ను ఔట్ చేశాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైన లబుషేన్. సిరాజ్ బౌలింగ్‌లో కొనస్టాస్ ఔటయ్యాడు. జైస్వాల్ స్లిప్‌లో క్యాచ్ అందుకున్నాడు. 12 ఓవర్‌లో ఐదో బంతికి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. ఒకే ఓవర్‌లో సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. ఈ సమయంలో క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తూనే స్మిత్, బ్యూ వెబ్ స్టర్ రన్స్ రాబట్టారు. ఈ ఇద్దరి భగస్వామ్యానికి ప్రసిధ్ తెర తీశాడు. ప్రసిధ్ వేసిన 27.1 ఓవర్‌లో ఆఫ్‌సైడ్ బాల్‌ను ఆడే క్రమంలో స్టీవ్ స్మిత్ స్లిప్‌లో కేఎల్ రాహుల్‌కు దొరియాడు. దీంతో 96 రన్స్ వద్ద ఆసీస్ 5వ వికెట్ కోల్పోయింది.
సిడ్నీ టెస్టు ఆడకపోవడంపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సిడ్నీ టెస్టు ఆడకపోవడంపై రోహిత్ శర్మ స్పందించాడు. తానే బెంచ్ పరిమితం కావాలని అనుకున్నట్లు వెల్డడించాడు. నా ఫామ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్ననట్లు తెలిపాడు. తనను తప్పించలేదని హిట్ మ్యాన్ మరోసారి స్పష్టం చేశాడు.