ఆసీస్‌ 181 ఆలౌట్‌

మొదటి ఇన్సింగ్స్‌లో భారత్‌కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం

Advertisement
Update:2025-01-04 10:59 IST

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 181 రన్స్‌కు ఆలౌట్‌ చేశారు. దీంతో టీమిండియాకు 4 పరుగుల ఆధిక్యం లభించింది. అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్‌ (57) హాఫ్‌ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ 3, సిరాజ్‌ 3, నితీశ్‌ 2, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 185 రన్స్‌ చేసిన విషయం విదితమే. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. మొదట్లోనే దూకుడుగా ఆడింది. స్టార్క్‌ వేసిన తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్‌ నాలుగు ఫోర్లు కొట్టాడు. ఇలా టెస్టు మ్యాచ్‌ మొదటి ఓవర్‌లో అత్యధిక రన్స్‌ రాబట్టిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే 42 రన్స్‌ వద్ద భారత్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. బోలాండ్‌ వేసిన 7.3 ఓవర్‌లో బాల్‌ను ఆడబోయి ఎడ్జ్‌ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో కేఎల్‌ రాహుల్‌ (13) పెవిలియన్‌ చేరాడు. స్వల్ప వ్యవధిలోనే 47 రన్స్‌ వద్ద యశ్వస్వీ ఔట్‌ అయ్యాడు. బోలాండ్‌ బౌలింగ్‌లో బంతి స్వింగ్‌ కావడంతో యశస్వీ జైస్వాల్‌ (22) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. . ఆసీస్‌ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ (6)మళ్లీ అదే పొరపాటు చేశాడు. బోలాండ్‌ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌ వచ్చిన బాల్‌ను కదిలించి స్లిప్‌లో స్మిత్‌కు దొరికిపోయి కోహ్లీ తన బలహీనతను బైటపెట్టుకున్నాడు. తీవ్ర అసహనంతో విరాట్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 59 రన్స్‌ వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోగా.. ముగ్గురు భారత టాప్‌ బ్యాటర్లను బోలాండ్‌ ఔట్‌ చేయడం గమనార్హం.ప్రస్తుతం ప్రస్తుతం రిషబ్‌ పంత్‌ (9*) శుభ్‌మన్‌ గిల్‌ (13*) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్ల వరకు  టీమిండియా కు 74 పరుగుల ఆధిక్యం లభించింది


Tags:    
Advertisement

Similar News