శాంటర్న్‌ విజృంభణ.. భారత్‌ 188/7

టీమిండియా విజయానికి మరో 171 రన్స్‌ కావాలి

Advertisement
Update:2024-10-26 14:46 IST

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఎదురీతున్నది. న్యూజిలాండ్‌ బౌలర్‌ శాంటర్న్‌ దెబ్బకు టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. రెండో ఇన్సింగ్స్‌లో 44 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 188/7 రన్స్‌ చేసింది. టీమిండియా విజయానికి మరో 171 రన్స్‌ కావాలి. ప్రస్తుతం జడేజా (9), అశ్విన్‌ (12) క్రీజులో ఉన్నారు. జైస్వాల్‌ 77 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ బౌలర్లలో శాంటర్న్‌ 5, గ్లెన్‌ ఫిలప్స్‌ ఒక వికెట్‌ తీశారు. కీపర్‌ రిషబ్‌ పంత్‌ అనవసరమైన రన్‌కు యత్నించి రనౌట్‌ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 259, భారత్‌ 156 పరుగులు చేయగా.. రెండో ఇన్సింగ్స్‌లో న్యూజీలాండ్‌ 255 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Similar News