మను బాకర్, గుకేశ్‌లకు ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారం

ఒలింపిక్స్‌ కాంస్యం విజేత మను బాకర్, గుకేశ్‌లకు ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న పురస్కారం వరించింది.

Advertisement
Update:2025-01-02 15:20 IST

దేశం తరఫున వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అందజేసే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్‌లను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2024-2025 సంవత్సరానికి గాను పారిస్ ఒలింపిక్స్‌ లో షూటింగ్ విభాగంలో కాంస్యం గెలిచిన మను బాకర్‌ , ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్న గుకేశ్ దొమ్మరాజు లు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైనట్లుగా ప్రకటించారు. అదేవిధంగా హకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్ సింగ్‌ , పారా ఒలింపిక్స్ ప్రవీణ్ కుమార్ కూడా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం దక్కింది.

వీటీతో పాటు మరో 32 మంది క్రీడాకారులకు అర్జునా అవార్డులను ప్రకటించారు. ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేయనున్నారు. కేంద్రం ప్రకటించిన క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. దీప్తిది ఉమ్మడి వరంగల్ జిల్లా కాగా..జ్యోతి విశాఖ వాసి.

Tags:    
Advertisement

Similar News