లంచ్‌ బ్రేక్‌.. భారత్‌ 3 వికెట్లు ఔట్

మళ్లీ విఫలమైన రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లీ

Advertisement
Update:2024-12-30 07:42 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 33/3 రన్స్‌ చేసింది. జట్టు విజయానికి ఇంకా 307 రన్స్‌ కావాలి. యశస్వి (14*) క్రీజులో ఉన్నాడు. రోహిత్‌ శర్మ 9, కేఎల్‌ రాహుల్‌ 0, విరాట్‌ కోహ్లీ 5 పరుగులకే వెనుదిరిగాడు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ 2, మిచెల్‌ స్టార్క్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474, భారత్‌ 369 రన్స్‌ చేసింది. రెండో ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా 234 పరుగులు చేసింది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి పేలవంగా ఆడాడు. కమిన్స్‌ వేసిన బాల్‌ను ఆడబోయి గల్లీలో మార్ష్‌ చేతికి చిక్కాడు. కెప్టెన్‌ బౌలింగ్‌లో ప్రత్యర్థి కెప్టెన్‌ ఔట్‌ కావడం ఇది ఆరోసారి. కేఎల్‌ రాహుల్‌ కూడా అంతే కమిన్స్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో దొరికిపోయాడు.విరాట్‌ కోహ్లీ ఔటైన తీరు అభిమానులను అసహనానికి గురిచేసింది. స్టార్క్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో దొరికిపోయాడు. వికెట్లకు దూరంగా పోతున్న బాల్‌ను వెంటాడి మరీ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తన బలహీనతను మరోసారి బైటపెట్టుకోవడంతో విరాట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News