సిడ్నీ టెస్టుకు కెప్టెన్‌ బూమ్రా?

రోహిత్‌ శర్మకు రెస్ట్‌ ఇచ్చే యోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌

Advertisement
Update:2025-01-02 18:37 IST

బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీలో చివరిదైన సిడ్నీ టెస్ట్‌ కు స్పీడ్‌ స్టర్‌ జస్ప్రీత్‌ బూమ్రా కెప్టెన్‌ గా వ్యవహరించనున్నారా? ఐదు టెస్టుల ఈ సిరీస్‌ లో ఇండియా ఒకే ఒక్క మ్యాచ్‌ లో గెలిచింది. అది కూడా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలోనే. రోహిత్‌ ఫామ్‌ లో లేకపోవడం, మరో స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌ కోసం తంటాలు పడుతుండటంతో చివరి టెస్టుకు తుది జట్టు ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపైనే వేటు వేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌ లో తొలి టెస్టును గెలిపించిన బూమ్రాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే కనీసం చివరి టెస్టులో విజయం సాధించి 2 -2తోనైనా సిరీస్‌ ను సమం చేస్తారనే ఆలోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. రోహిత్‌ శర్మ స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌ కు తుది జట్టులో చోటు ఖాయమని తెలుస్తోంది. ఆకాశ్‌ దీప్‌ సింగ్‌ గాయం కారణంగా తుది జట్టులో ఉండడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఆయన స్థానంలో యువ స్పిన్నర్‌ ప్రసిధ్ కృష్ణకు అవకాశం ఇస్తారని చెప్తున్నారు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ స్థానంలో మరో వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌ కు చాన్స్‌ ఇస్తారని సమాచారం.

Tags:    
Advertisement

Similar News