ఇంగ్లండ్‌తో టీ20, వన్‌డే సిరీస్‌ కు బూమ్రాకు రెస్ట్‌

ఐదు టీ 20లు, మూడు వన్‌డేలకు త్వరలోనే టీమ్‌ ప్రకటన

Advertisement
Update:2024-12-31 18:05 IST

ఇండియాలో ఇంగ్లండ్‌ టూర్‌ కు స్పీడ్‌ స్టర్‌ జస్ప్రీత్‌ బూమ్రాకు రెస్ట్‌ ఇవ్వాలనే యోచనలో బీసీసీఐ ఉంది. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు సిడ్నీ వేదికగా బోర్డర్ - గవాస్కర్‌ ట్రోఫీలో చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు టెస్టుల్లో బూమ్రా 30 వికెట్లు పడగొట్టాడు. టెస్టు సిరీస్‌లో సుదీర్ఘంగా బౌలింగ్‌ చేశాడు. ఈ టెస్టు ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశానికి తిరిగి వస్తుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి టీమిండియా సిద్ధమవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇండియాలో ఇంగ్లండ్‌ టీమ్‌ పర్యటనకు బూమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలో సెక్టర్లు ఉన్నారు. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్‌డే మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు టీ 20 సిరీస్‌, ఫిబ్రవరి 6 నుంచి 12వ తేదీ వరకు వన్‌ డే సిరీస్‌ జరగనుంది. త్వరలోనే ఇంగ్లండ్‌తో టీ20, వన్‌డే టీమ్‌లకు సెలక్షన్‌ కమిటీ జట్లను ప్రకటించనుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో టీ20, రోహిత్‌ శర్మ నేతృత్వంలో వన్‌డే జట్లను ప్రకటించనున్నారు.

Tags:    
Advertisement

Similar News