నాలుగో టెస్టులో భారత్ ఘోర ఓటమి
నాలుగో టెస్టులో భారత్ 184 పరుగుల తేడాతో ఓటమి పాలైంది
మెల్‌బోర్న్‌టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో 184 పరుగుల తేడాతో ఆసీస్ నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైస్వాల్ 84, రిషబ్ పంత్ 30 మినహా మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ 3 వికెట్లు లయన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆసీస్ 2-1 లీడ్‌లో ఉంది. మొత్తం 5 టెస్టుల మ్యాచులో ఒకటి డ్రా అవ్వగా.. రెండు ఆసీస్, ఒకటి భారత్ విజయం సాధించాయి. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 155 పరుగులకు ఆలౌటైంది.
ఆఖరి వరకు డ్రా కోసం భారత్ ప్రయత్నించినప్పటకి, ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి భారత్ ముందు 340 పరుగుల టార్గెట్‌ను కంగారులు ఉంచారు. ఆ లక్ష్యాన్ని చేధించడంలో భారత్ చతికలపడింది. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా వేదికగా ప్రారంభం కానుంది.