టెస్టు క్రికెట్లో టాప్ ర్యాంక్ ముంగిట్లో అశ్విన్!

భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ను టెస్ట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఊరిస్తోంది. ప్రస్తుత టాప్ ర్యాంకర్ యాండర్సన్ కంటే అశ్విన్ రెండుపాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు.

Advertisement
Update:2023-02-24 11:08 IST

భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ను టెస్ట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఊరిస్తోంది. ప్రస్తుత టాప్ ర్యాంకర్ యాండర్సన్ కంటే అశ్విన్ రెండుపాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు.

టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ సాధించడానికి భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం 3 పాయింట్ల దూరంలో నిలిచాడు. ప్రస్తుత ప్రపంచ నంబర్ ర్యాంక్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ కంటే 2 పాయింట్లు మాత్రమే వెనుకున్నాడు.

ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 40 సంవత్సరాల యాండర్సన్ 866 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే..భారత స్పిన్ జాదూ అశ్విన్ 864 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

2019 ఫిబ్రవరి నుంచి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతూ వచ్చిన ఆస్ట్ర్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 858 పాయింట్లతో మూడోర్యాంక్ కు పడిపోయాడు.

ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ 820 పాయింట్లతో 4, భారత యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా 795 పాయింట్లతో 5, పాక్ ఫాస్ట్ బౌలర్ షహీన్ ఆఫ్రిదీ 787 పాయింట్లతో 6 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

భారత లెఫామ్ స్పిన్ మాంత్రికుడు రవీంద్ర జడేజా 763 పాయింట్లతో 9వ ర్యాంకులో నిలిచాడు.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా జరిగే మిగిలిన రెండుటెస్టుల్లో అశ్విన్ మరో 3 పాయింట్లు సాధించగలిగితే జిమ్మీ యాండర్సన్ ను అధిగమించడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను అందుకొనే అవకాశం ఉంది.

ఆస్ట్ర్రేలియాపై 100 వికెట్ల అశ్విన్..

ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నాగపూర్, ఢిల్లీ వేదికలుగా ముగిసిన మొదటి రెండుటెస్టుల్లో నిలకడగా రాణించడం ద్వారా అశ్విన్ పలు అరుదైన రికార్డులు సాధించాడు.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా 100 వికెట్లు సాధించిన భారత రెండో బౌలర్ గా అనీల్ కుంబ్లే తర్వాతిస్థానంలో నిలిచాడు. అంతేకాదు..స్వదేశీ సిరీస్ ల్లో 25సార్లు ఐదుకు పైగా వికెట్లు పడగొట్టడం ద్వారా కుంబ్లే రికార్డును సమం చేయగలిగాడు.

టెస్టు చరిత్రలో సొంతగడ్డపై అత్యధికంగా ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల చొప్పున 45 సార్లు సాధించిన ప్రపంచ రికార్డు శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీధరన్ పేరుతో ఉంది.

ఆ తర్వాత 26సార్లు 5 వికెట్ల ఘనతతో రంగన్ హెరాత్ నిలిచాడు.

భారత గడ్డపై 320 వికెట్ల అశ్విన్...

స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో 319 వికెట్లు సాధించిన షేన్ వార్న్ రికార్డును 320 వికెట్లతో అశ్విన్ అధిగమించాడు. సొంతగడ్డపై అత్యధిక వికెట్లు సాధించిన మొనగాళ్లలో ముత్తయ్య మురళీధరన్ ( 493 ), జేమ్స్ యాండర్సన్ ( 429 ), స్టువర్ట్ బ్రాడ్ ( 370 ), అనీల్ కుంబ్లే ( 350 ) మొదటి నాలుగు స్థానాలలో నిలిచారు.

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా వంద వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు. 20 టెస్టుల్లో వికెట్ల శతకాన్ని పూర్తి చేయగలిగాడు.

హర్భజన్ సింగ్ 18 టెస్టుల్లో 95 వికెట్లు, కుంబ్లే 20 టెస్టుల్లో 111 వికెట్లు సాధించారు.

31సార్లు 5 వికెట్ల అశ్విన్...

టెస్టుమ్యాచ్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల చొప్పున 31సార్లు పడగొట్టిన బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. టెస్టు చరిత్రలో జిమ్మీ యాండర్సన్ 32సార్లు సాధిస్తే , మురళీధరన్ 45సార్లు, హెరాత్ 26సార్లు పడగొట్టారు.

ఆస్ట్ర్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్సీ కేరీని క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో తన 450 వికెట్ సాధించగలిగాడు. కంగారూ టాపార్డర్ బ్యాటర్ మార్నుస్ లబుషేన్ ను అవుట్ చేయడం ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 700వ వికెట్ ను సైతం అశ్విన్ సొంతం చేసుకోగలిగాడు.

ఇండోర్, అహ్మదాబాద్ వేదికలుగా ఆస్ట్ర్రేలియాతో జరిగే మిగిలిన రెండుటెస్టుల్లోనూ అశ్విన్ మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News