దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

బ్యాటింగ్‌లో సంజు శాంసన్‌.. బౌలింగ్‌లో రాణించిన వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌

Advertisement
Update:2024-11-09 00:25 IST

సఫారీల గడ్డపై భారత యవ జట్టు అదరగొట్టింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 61 రన్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది.టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 రన్స్‌ చేసింది. అనంతరం లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన సఫారీ జట్టు 17.5 ఓవర్ల వద్ద 141 పరుగులకే ఆలౌటైంది. సఫారీ జట్టులో స్టార్‌ ఆటగాడు క్లాసెన్‌ (25) టాప్‌ స్కోరర్‌. మిగతా వారంతా విఫలమయ్యారు.వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌ మూడేసి వికెట్లు తీయగా.. అవేశ్‌ 2, అర్ష్‌దీప్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అంతకు ముందు ఓపెనర్‌ సంజు శాంసన్‌ (107) సెంచరీతో అదరగొట్టాడు. తిలక్‌ వర్మ (33), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (21) రాణించారు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్‌ 3, మార్కో, కేశవ్‌, పీటర్‌, పాట్రిక్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

శాంసన్‌ అరుదైన రికార్డు

టీమిండియా ఓపెనర్‌ సంజు శాంసన్‌ 47 బాల్స్‌లోనే 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో సెంచరీ చేశాడు. దీంతోరెండు వరుస టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించారు. ఇటీవల హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీ (111) చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీ20లో దక్షిణాఫ్రికాపై టీమిండియాకు (202/) అత్యధిక స్కోరు కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News