కివీస్ క్లీన్‌స్వీప్
మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్ వాష్ కావడం ఇదే మొదటిసారి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో 29 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కీపర్ రిషభ్ పంత్ నిలదొక్కుకుని హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో మ్యాచ్ తిరిగి గాడిలో పడ్టట్లేనని అంతా అనుకున్నారు. 64 రన్స్ చేసిన పంత్ ఔట్ కావడంతో తర్వాత వికెట్లన్నీ చకచకా పడ్డాయి. దీంతో 121 పరుగులకు భారత్ ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6 వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీసి భారత్‌ను కోలుకోని దెబ్బతీశారు.
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ టాప్ ఆర్డర్‌ను కివీస్ స్పిన్నర్లు ఇబ్బందిపెట్టారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో చెలరేగిపోయారు. ముఖ్యంగా స్పిన్నర్ అజాజ్ పటేల్ దెబ్బకు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 92/6 రన్స్ చేసింది. టీమిండియా విజయానికి మరో 55 రన్స్ కావాల్సి ఉన్నది. రిషబ్ పంత్ (53నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్) క్రీజ్‌లో ఉండటంతో మ్యాచ్‌పై ఆశలు ఉండేవి. కానీ లంచ్ తర్వాత కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.దీంతో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్ వాష్ కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అజాజ్ పటేల్ (6/57), గ్లెన్ ఫిలిప్స్ (3/42), మాట్ హెన్రీ (1/10) దెబ్బకు భారత్ కుప్పకూలింది. అజాజ్ తొలి ఇన్సింగ్స్‌లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ (64 మినహా ఎవరూ రాణించలేదు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 3-0 తేడాతో కైవసం చేసుకున్నది. తొలి ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ 235 రన్స్ చేయగా... భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్సింగ్స్‌లో కివీస్ 174 రన్స్ చేసింది.