మైక్ టైసన్‌ను మట్టికరిపించిన యూ ట్యూబర్ జేక్ పాల్
సుమారు రెండు దశాబ్దాల తర్వాత ప్రొఫెషనల్ రింగ్‌లోకి దిగిన మైక్ టైసన్
దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌కు పరాభవం ఎదురైంది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ప్రొఫెషనల్ రింగ్‌లోకి దిగిన మైక్ టైసన్ మునుపటి ఉత్సాహం చివరివరకూ చూపెట్టలేకపోయాడు. యూ ట్యూబర్ జేక్ పాల్‌తో జరిగిన పోరులో 74-78 తేడాతో ఓటమి పాలయ్యాడు. బౌట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాల్‌ను చెంపదెబ్బకొట్టిన మైక్ టైసన్ పోరుపై ఆసక్తి పెంచాడు. దానికితగ్గట్గుగానే మొదటి రెండు రౌండ్లలో 58 ఏల్ల టైసన్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. కానీ ఆ పట్టును తుదకంటా కొనసాగించలేకపోయాడు. మూడో రౌండ్ నుంచి పుంజుకొన్న 27 ఏళ్ల యూట్యూబర్ జేక్ పాల్ వెనుదిరిగి చూడలేదు.
మైక్-జేక్ మధ్య ఎనిమిది రౌండ్లు జరిగాయి. ఆరు రౌండ్లలో పాల్ గెలువగా.. మైక్ టైసన్ రెండు రౌండ్లతోనే సరిపెట్టుకున్నాడు. దీంతో 10-9, 10-9, 9-10, 9-10, 9-10, 9-10, 9-10, 9-10 తేడాతో పాల్ విజయం సాధించాడు. బౌట్ తర్వాత వారిద్దరూ మామూలుగా అభివాం చేసుకోవడం గమనార్హం. 2005లో కెవిన్ చేతిలో ఓటమి తర్వాత టైస్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు గుడ్ బై చెప్పిన విషయం విదితమే. ఇప్పుడీ బౌట్‌లో తలపడటం కోసం టైసన్ దాదాపు రూ. 168 కోట్లు, పాల్ సుమారు రూ. 337 కోట్లు పొందనున్నట్లు తెలిసింది. పోటీకి ముందు టైసన్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఫ్యాన్స్ కోసం విజయం సాధిస్తానన్నాడు. ఆ టైమ్‌లో అతను న్యూడ్‌గా ఇంటర్వ్యూ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.