రోహిత్ తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం
రెగ్యులర్ కెప్టెన్ ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడన్న రవిశాస్త్రి
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు మ్యాచ్ సిడ్నీలో జరుగుతున్నది. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు. రోహిత్ పక్కకు వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సమయంలో కెప్టెన్ బూమ్రా వెల్లడించారు. ఈ క్రమంలో రోహిత్ నిర్ణయం భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కోసం ఇలా చేయడం అద్భుతమని కొనియాడాడు. 'టాస్ సమయంలో జస్‌ప్రీత్ బూమ్రాను ఇదే మాట అడిగా.. సారథే తనకు తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు. శుభ్‌మన్ గిల్ ఆడితే జట్టు బలంగా ఉంటుందని భావించాడు. అలా జరగాలంటే రోహిత్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకే రెగ్యులర్ కెప్టెన్ ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడని రవిశాస్త్రి తెలిపారు.
రోహిత్ శర్మ 16 మంది స్క్వాడ్‌లోనూ లేడు
సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ 16 మంది స్క్వాడ్‌లోనూ లేడు. దీనికి కారణం ఉన్నది. ఒకవేళ స్వదేశంలో ఏదైనా టెస్టు సిరీస్ దగ్గరలో ఉండి ఉంటే అతను ఉండేవాడు. కానీ ఎలాంటి సిరీస్‌లు లేవు. ఈ టెస్టు ముగిసేలోపు మరో కీలక నిర్ణయం రావొచ్చు. అతడేమీ యువకుడు కాదు. రోహిత్ వయసు 38 ఏళ్లు. కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. జట్టులో మార్పులు తీసుకురావడం కఠినమైన నిర్ణయమే. కానీ ప్రతి జట్టుకూ ఇలాంటిది తప్పదు. అని మాజీ ప్రధాన కోచ్ వ్యాఖ్యానించాడు. రోహిత్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. జట్టు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నాడు.