ఇది అరంగేట్రాల సీజన్ గురూ..!
భారత టెస్ట్ క్రికెట్ జట్టులోకి కొత్తనీరు వచ్చేస్తోంది. తాజాగా ఇంగ్లాండ్‌తో రాంచీలో మొదలయిన నాలుగో టెస్ట్‌లో పేసర్ ఆకాశ్‌దీప్ అరంగేట్రం చేశాడు.
భారత టెస్ట్ క్రికెట్ జట్టులోకి కొత్తనీరు వచ్చేస్తోంది. తాజాగా ఇంగ్లాండ్‌తో రాంచీలో మొదలయిన నాలుగో టెస్ట్‌లో పేసర్ ఆకాశ్‌దీప్ అరంగేట్రం చేశాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ అతనికి టెస్ట్ క్యాప్ అందజేసి, జాతీయ జట్టులోకి ఆహ్వానించాడు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది.
ముకేశ్‌ను వద్దని ఆకాశ్‌దీప్‌కు అవకాశం
రాంచీ టెస్ట్‌కు స్పీడ్‌గన్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే ఈ సిరిస్‌లో ఇప్పటికే ఆడినా తేలిపోయిన ముకేశ్‌కుమార్‌ను కాదని ఆకాశ్‌దీప్‌కు జాతీయ జట్టులో తొలిమ్యాచ్ అడే అవకాశం కల్పించారు. బెంగాల్ పేస్‌బౌలర్ అయిన ఆకాశ్‌దీప్ ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు ఆడుతున్నాడు. అప్పడప్పుడూ బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తాడు.
రజత్ పటీదార్‌తో మొదలు
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో కోహ్లీ, గాయాలతో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ దూరమయ్యారు. దీంతో యువ ఆటగాళ్లకు అనుకోని వరంలా తుది జట్టులో చోటు దక్కుతోంది. విశాఖలో జరిగిన రెండో టెస్ట్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రజత్ పటీదార్ టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో ఇద్దరు ఆటగాళ్లు రంగప్రవేశం చేశారు. ఎన్నాళ్లగానో జాతీయ జట్టులో స్థానం కోసం వేచి చూస్తున్న సర్ఫరాజ్‌ఖాన్‌తోపాటు యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆరంగేట్రం చేశారు. ఇందులో సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టేశాడు. జురెల్ కూడా కీపింగ్‌లో ఆకట్టుకున్నాడు..