గబ్బా టెస్ట్.. మొదటిరోజు వర్షార్పణం
తొలి సెషన్‌లో వర్షం పడటంతో ఆటకు బ్రేక్. రెండు, మూడు సెషన్లలో ఒక్క బాల్ పడకుండానే ముగిసిన రోజు
బోర్డర్ గావస్కర్ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. మొదటి సెషన్ మధ్యలో వర్షం రావడంతో ఆటను ఆపారు. రెండు, మూడు సెషన్లలో ఒక్క బాల్ కూడా పడలేదు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండానే 28 రన్స్ చేసింది. మెక్ స్వీనీ (4 నాటౌట్), ఖవాజా (19 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఐదు టెస్టుల సిరీస్ లో భారత్, ఆసీస్ ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమం చేశాయి.
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మొదటిరోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్లేమీ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. మెక్ స్వీనీ (4నాటౌట్), ఖవాజా (19 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా ఆటకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా సుమారు గంట ఆట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అంప్లైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అప్పటికి ఆసీస్ వికెట్లేమీ నష్టపోకుండా 13.2 ఓవర్లకు 28 రన్స్ చేసింది. ఈ టెస్టులో గెలిస్తే ఆధిక్యంలోకి దూసుకెళ్లవచ్చు.