యాపిల్ కు చుక్కెదురు

ఐఫోన్‌లలో ఐఓఎస్‌ 18+ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లోని లోపాలపై సీసీపీఏ నోటీసులు

Advertisement
Update:2025-01-23 13:18 IST

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ కు చుక్కెదురైంది. ఐఫోన్‌లలో ఐఓఎస్‌ 18+ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లోని లోపాలకు సంబంధించిన ఫిర్యాదులపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఇటీవల తమ ఐఫోన్‌లలో ఐవోఎస్‌ 18+ అప్‌డేట్‌ చేసిన తర్వాత సమస్యలు వస్తున్నట్లు యూజర్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీపీఏ రంగంలోకి దిగింది. వారి ఫిర్యాదుల మేరకు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ద్వారా నోటీసులు పంపించామని మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. వచ్చిన వినతులు పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ తర్వాత తలెత్తిన సాంకేతిక సమస్యలపై యాపిల్‌ వివరణ ఇవ్వనున్నది. 

Tags:    
Advertisement

Similar News