జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్‌ 15 ప్రయోగం సక్సెస్‌

వందో ప్రయోగం విజయవంతంతో షార్‌లో సంబరాలు

Advertisement
Update:2025-01-29 08:34 IST

శ్రీహరికోటలోని షార్‌లో బుధవారం తెల్లవారుజామున పండుగ వాతావరణం నెలకొంది. ఇస్రో చరిత్రలో వందో ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్‌ 15 రాకెట్‌ ఎన్‌వీఎస్‌ -02 శాటిలైట్‌ ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. శాటిలైట్‌ ను విజయవంతంగా భూ కక్షలో ప్రవేశపెట్టింది. దీంతో సైంటిస్టులు సంబరాలు చేసుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎన్‌వీఎస్‌ -02 నావిగేషన్‌ శాటిలైట్‌ను రూపొందించారు. 2,250 కేజీల బరువున్న ఈ శాటిలైట్‌ కొత్తరకమైన నావిగేషన్‌ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో చీఫ్‌గా ఇటీవలే వి. నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన చార్జ్‌ తీసుకున్న తర్వాత, 2025లో మొదటి ఉపగ్రహ ప్రయోగం కూడా ఇదే. ఎన్‌వీఎస్‌ -02 ఉపగ్రహం వందేళ్ల పాటు సేవలందిస్తుందని నారాయణన్‌ వెల్లడించారు. విక్రమ్ సారాబాయ్‌ కాలం నుంచి ఇస్రో జైత్రయాత్ర కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు ఆరు జనరేషన్ల లాంచ్‌ వెహికిల్స్‌ అభివృద్ధి చేశామని తెలిపారు. 1979లో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో మొదటి లాంచ్‌ వెహికిల్ ప్రయోగం జరిగిందని.. ఇప్పటి వరకు శ్రీహరికోట నుంచి వంద ప్రయోగాలు జరిగాయని చెప్పారు. ఈ వంద ప్రయోగాల్లో లాంచ్‌ వెహికిల్స్‌ 548 శాటిలైట్లను కక్షలోకి చేర్చాయని చెప్పారు. చంద్రయాన్‌, మార్స్‌ ఆర్బిటర్‌, ఆదిత్య, ఎస్‌ఆర్‌ఈ మిషన్లను చేపట్టామని వివరించారు.




 


Tags:    
Advertisement

Similar News